మంత్రి హరీశ్‌కు ఆహ్వానం
మిషన్ కాకతీయ-చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు తమ విశ్వవిద్యాలయానికి రావాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈ మేరకు వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం మంత్రికి లేఖను పంపింది.ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన మిషిగన్ వర్సిటీ విద్యార్థి బృందం తెలంగాణలో పరిశోధన చేస్తోంది. ఆగస్టులో వివిధ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం తమ ప్రాథమిక అధ్యయన నివేదికను వర్సిటీకి సమర్పించింది. నివేదికను ఆమోదించిన వర్సిటీ అధికారులు దీనిపై విస్తృత పరిశోధనకు 50 వేల డాలర్లను (సుమారు రూ. 30 లక్షలు) కేటాయించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








